GST Collection September : వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లలో జోరు కొనసాగుతోంది. వరుసగా ఏడో నెల రూ.1,40 వేల కోట్లకుపైగా వసూళ్లు నమోదయ్యాయి. ఈ సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1,47,686 కోట్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2021 సెప్టెంబర్లో వసూలైన జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈసారి 26 శాతం పెరిగినట్టు వివరించింది.
ఈ మొత్తంలో సీజీఎస్టీ వసూళ్లు.. రూ.25,271 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.31,813 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సమీకృత జీఎస్టీ వసూళ్లు.. రూ.80,464 కోట్లు ఉండగా.. సెస్ రూపంలో రూ.10,137 కోట్లు వసూలైనట్లు వివరించింది. ఈసారి ఈ-వేబిల్స్లో కూడా రికార్డు నమోదైనట్లు ఆర్థికశాఖ తెలిపింది. సెప్టెంబర్లో రూ.1.1 కోట్ల ఈ-వేబిల్స్, ఈ-ఇన్వాయిస్లలో జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు పేర్కొంది.