తెలంగాణ

telangana

ETV Bharat / business

26 శాతం పెరిగిన స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.13.63 లక్షల కోట్ల ఆదాయం.. - వ్యక్తిగత ఆదాయపు పన్ను

గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే.. ఈ ఏడాది స్ధూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 26 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ వసూళ్లు రూ. 13.63 కోట్లుకు చేరినట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇవి 80 శాతానికి సమానమని వెల్లడించింది.

gross direct tax collection
ప్రత్యక్ష పన్ను వసూళ్లు

By

Published : Dec 19, 2022, 7:48 AM IST

ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటి వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే సమయం కంటే 26% పెరిగి రూ.13.63 లక్షల కోట్లకు చేరాయని అధికారిక ప్రకటన తెలిపింది. టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత)తో పాటు కార్పొరేట్‌ అడ్వాన్స్‌ ట్యాక్స్‌లు బాగా వసూలు కావడం దీనికి దోహదపడిందని తెలిసింది. రిఫండ్‌లను సర్దుబాటు చేశాక, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇవి 80 శాతానికి సమానం. ఏడాది క్రితం ఇదే సమయంలో వసూలైన రూ.9,47,959 కోట్లతో పోలిస్తే ఇవి 19.81 శాతం అధికం.

  • 2021-22లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లకు పెంచారు. ఈనెల 17 వరకు సుమారు రూ.2.28 లక్షల కోట్ల రిఫండ్‌లను జారీ చేశారు. ఏడాది క్రితంతో పోలిస్తే ఇవి 68 శాతం పెరిగాయి.
  • స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13,63,649 కోట్లలో కార్పొరేట్‌ ఆదాయపు పన్ను (సీఐటీ) రూ.7.25 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ), సెక్యూరిటీల లావాదేవీ పన్ను (ఎస్‌టీటీ) కలిపి రూ.6.35 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించింది.
  • అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు, టీడీఎస్‌ రూ.6.44 లక్షల కోట్లు, స్వయం మదింపు పన్ను రూ.1.40 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. ముందస్తు పన్ను వసూళ్లు ఏడాది క్రితంతో పోలిస్తే 12.83 శాతం వృద్ధి చెందాయి. సీఐటీ రూ.3.97 లక్షల కోట్లు, పీఐటీ రూ.1.23 లక్షల కోట్లుగా ఉన్నాయి.
  • డిసెంబరు 17 వరకు సమర్పించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో వెరిఫై చేసిన ఐటీఆర్‌లను 96.5 శాతం మేర ప్రాసెస్‌ చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. రిఫండ్‌లు వేగంగా చెల్లించడంతో పాటు 109 శాతం వృద్ధి చెందాయని తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details