Greta Electric Scooters: గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంస్థ సరికొత్త విద్యుత్ స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది. గ్రేటా హార్పర్ జెడ్‌ఎక్స్ సిరీస్-1గా వ్యవహరించే దీని ప్రారంభ ధర రూ.41,999 (ఎక్స్ షోరూం). బ్యాటరీ, ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వినియోగదారుడు తమ వినియోగం ఆధారంగా బ్యాటరీని, ఛార్జర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీల వరకు నడిచేందుకు వీలున్న 'వీ2 48వీ- 24ఏహెచ్' బ్యాటరీ ధర రూ.17,000- 20,000 కాగా.. 100 కి.మీ ప్రయాణించేందుకు అనువైన 'వీ3+60వీ-30ఏహెచ్' బ్యాటరీ ధర రూ.27,000- 31,000 మధ్య లభ్యం కానుంది. ఛార్జర్ ధర రూ.3,000- 5,000 మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది.
గ్రెటా ఎలక్ట్రిక్ కొత్త విద్యుత్ స్కూటర్.. విడిగానే బ్యాటరీ, ఛార్జర్!
Greta Electric Scooters: సరికొత్త విద్యుత్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంస్థ. బ్యాటరీ, ఛార్జర్‌లను విడిగా అమ్మకానికి పెట్టింది. వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.2,000 ముందస్తు చెల్లింపుతో (డౌన్ పేమెంట్) ఈ కొత్త విద్యుత్తు స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. బుకింగ్‌లో వరుస క్రమం ఆధారంగా 45- 75 రోజుల్లో స్కూటర్‌ను డెలివరీ చేస్తామని పేర్కొంది. ఎకో, సిటీ, టర్బో మోడల్‌లో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఎకో మోడల్‌లో ఒక్క ఛార్జింగ్‌కు 100 కి.మీ, సిటీ మోడ్‌లో 80 కి.మీలు, టర్బో మోడ్‌లో 70 కి.మీ వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. క్యూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ కంట్రోలర్, హైవే లైట్స్, సైడ్ ఇండికేటర్ బజర్, ఎల్‌ఈడీ మీటర్ లాంటి ప్రత్యేకతలు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్నాయని పేర్కొంది.
ఇదీ చూడండి:మార్కెట్లోకి 'హ్యుందాయ్' కొత్త కారు - ధర, ఫీచర్లు ఇలా..