తెలంగాణ

telangana

ETV Bharat / business

EPFO Interest Rate : ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఈపీఎఫ్​ఓ వడ్డీ రేటు 8.15 శాతానికి కేంద్రం ఓకే! - epf interest rate 2023 24

EPFO Interest Rate Hike : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంప్లాయీస్​ ప్రావిడెంట్​ ఫండ్​ వడ్డీ రేటును 8.15 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Govt ratifies EPF interest rate for 2022  23
epfo interest

By

Published : Jul 24, 2023, 1:55 PM IST

Updated : Jul 24, 2023, 2:42 PM IST

EPFO Interest Rate Hike : ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్​ (ఈపీఎఫ్​ఓ) వడ్డీ రేటు 8.15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది గతేడాదితో పోల్చితే 0.05 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దీని వల్ల ఆరు కోట్ల ఈపీఎఫ్​ఓ చందాదారులకు లాభం చేకూరనుంది.

EPFO Late interest rates : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) 2023 మార్చి 28న ఈపీఎఫ్​ వడ్డీ రేట్లు మార్జినల్​గా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సోమవారం అన్ని ఉద్యోగ కార్యాలయాలను తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన 8.15 శాతం వడ్డీ రేటును కలిపి ఉద్యోగుల భవిష్య నిధికి జమ చేయాలని స్పష్టం చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రి 2023 మార్చిలో ఈపీఎఫ్​ఓ ట్రస్టీలతో సమావేశం అయ్యి, వడ్డీ రేట్లు పెంపు గురించి చర్చించారు. అందులో భాగంగా సెంట్రలో బోర్డ్ ట్రస్టీ (సీబీటీ) 2022-23 సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ ఇవ్వాలని తీర్మానించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. మార్జినల్​ వడ్డీ రేట్లు 8.15 శాతం మేర పెంచుతూ.. దానిని అమలుపరచాలని అన్ని ఎంప్లాయర్​ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈపీఎఫ్​ఓ ఫీల్డ్ ఆఫీసర్లు.. త్వరలో ఈ పెంచిన వడ్డీ రేట్లను ఖాతాదారుల అకౌంట్​ల్లో క్రెడిట్ చేసే పనిని ప్రారంభించనున్నారు.

EPF Interest Rate : ఈపీఎఫ్​ఓ 2022 మార్చిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 8.5 శాతం నుంచి నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయి 8.10 శాతానికి తగ్గించింది. ఇది 1977-78 నాటి నుంచి 2022 వరకు వడ్డీ రేట్లలో ఇదే అత్యంత కనిష్ఠం కావడం గమనార్హం. వాస్తవానికి 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్​ వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా, అప్పటి నుంచి ఒక్క ఏడాది మినహా వడ్డీ రేట్లు క్రమంగా తగ్గిస్తూ వచ్చారు.

Last Updated : Jul 24, 2023, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details