సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారికి ఇప్పుడు గుండెల్లో పెద్ద బండరాయి!. కేంద్ర ప్రభుత్వం వారి కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. సోషల్ మీడియా ప్రభావశీలులు.. వారు ఆమోదించే ఉత్పత్తితో తమ అనుబంధాన్ని ప్రకటించాల్సిందేనని వినియోగదారుల వ్యవహారాల విభాగం స్పష్టం చేసింది. అది కూడా స్పష్టమైన భాషలో అర్ధమయ్యేటట్లు చెప్పాలని, నెటిజన్లు అది మిస్ కాకుండా ఉండేటట్లు తెలియజేయాలని ఆదేశించింది.
ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు షాక్.. ప్రమోట్ చేయాలనుకున్న బ్రాండ్‌ను ముందే ప్రకటించాల్సిందే!
ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పదం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న చాలామంది.. రకరకాల బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అయితే అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానా కూడా విధించనుంది.
Govt makes disclosure of material interest mandatory for social media influencers
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వినియోగదారుల వ్యవహారాల విభాగం వారికి భారీగా జరిమానా విధించనుంది. తొలిసారి నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రెండో సారి జరిగితే రూ. 50 లక్షల జరిమానా చెల్లించాలి. అంతే కాకుండా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ.. వారిపై మూడేళ్ల వరకు నిషేధం కూడా విధించే అవకాశం ఉంది.