తెలంగాణ

telangana

Got An Income Tax Notice Dont Panic Take These Actions: ITR ఫైల్​ చేసిన తర్వాత నోటీసు వచ్చిందా..? అయితే ఇలా చేయండి..!

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 10:32 AM IST

Got An Income Tax Notice Dont Panic Take These Actions: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్న్​ ఫైల్ చేసిన వారిలో చాలా మందికి సంస్థ నుంచి నోటీసులు వస్తున్నాయి. వివిధ కారణాలతో ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు పంపిస్తోంది. ఇలా నోటీసు రాగానే చాలా మంది పన్ను చెల్లింపుదారులు టెన్షన్ పడుతుంటారు. అయితే, అన్ని నోటీసులూ మీకు ఇబ్బందులు తెచ్చి పెట్టవనే సంగతి గుర్తుంచుకోవాలి. ఐటీ నోటీస్ రాగానే కంగారు పడకూడదు. మరి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఇలా ఐటీ నోటీసులు వచ్చినట్టైతే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

If_Income_Tax_Notice_Get_What_Should_I_Do
If_Income_Tax_Notice_Get_What_Should_I_Do

Got An Income Tax Notice Dont Panic Take These Actions: ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులపై ప్రత్యేక నిఘా పెడుతోంది. ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారు..? వారు చెల్లింపు పన్ను సరిగ్గానే ఉందా? లేదా అనే విషయంపై ఆరా తీస్తోంది. తప్పుడు లెక్కలు అందించిన వారికి నోటీసులు పంపిస్తోంది. అధిక ఆదాయం ఉండి తక్కువ చూపించే వారిపై ఓ కన్నేసింది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ 22 వేల మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసు పంపింది.

ఇందులో జీతం, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ట్రస్ట్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. అటువంటి వ్యక్తుల మినహాయింపు క్లెయిమ్ ఫారమ్ 16 లేదా వార్షిక సమాచార ప్రకటనతో లేదా ఆదాయపు పన్ను శాఖ గణాంకాల ప్రకారం సరిపోలడం లేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసిన దాదాపు 22వేల మందికి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. గడచిన 15 రోజుల వ్యవధిలో ఈ ఇన్టిమేషన్ నోటీసులన్నీ పంపబడ్డాయి. దీంతో తీవ్ర కలకలం రేగింది.

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

టాక్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. జీతం పొందే ఉద్యోగులు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ట్రస్టులకు నోటీసులను పంపినట్లు వెల్లడించారు. వీరు ఐటీఆర్ ప్రకారం క్లెయిమ్ చేసిన రిఫండ్స్​.. వారి ఫారమ్ 16 లేదా వార్షిక సమాచార ప్రకటన(AIS)లోని సమాచారంతో సరిపోలలేదని నోటీసుల్లో స్పష్టం చేసింది. రిటర్న్‌లు, డిపార్ట్‌మెంటల్ గణాంకాల్లో క్లెయిమ్ చేసిన పన్ను మినహాయింపుల మధ్య 50వేల రూపాయల కంటే ఎక్కువ వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు.

నోటీసులు అందుకున్న వారిలో దాదాపు 12వేల మంది జీతాలు పొందే ఉద్యోగులు ఉన్నారు. అలాగే HUF విభాగంలో రిటర్న్‌లు దాఖలు చేసిన సుమారు 8వేల మంది పన్ను చెల్లింపుదారులకు కూడా డిపార్ట్‌మెంట్ నోటీసు పంపింది. దాఖలు చేసిన రిటర్న్‌కు, డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన డేటా మధ్య ఆదాయ వ్యత్యాసం 50 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు తేలడంతో తాజా చర్యలకు అధికారులు ఉపక్రమించారు.

ITR Refunds Big Update : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఐటీ రిఫండ్​పై కీలక ప్రకటన!

ఇదే క్రమంలో రూ.5 కోట్ల కంటే ఎక్కువ వ్యత్యాసంతో రిటర్న్స్ ఫైల్ చేసిన 900 మంది HNIలు, రూ.10 కోట్ల కంటే ఎక్కువ వ్యత్యాసం కలిగి ఉన్న 12 వందల ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలకు కూడా IT శాఖ నోటీసులు పంపింది. సాధారణంగా డిపార్ట్‌మెంట్ ప్రైమరీ డేటా అనలిటిక్స్ దాదాపు 2 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్న్‌లలో అక్రమాలు, ఇర్రెగ్యులారిటీలను గుర్తించింది. సదరు వ్యక్తుల బ్యాంక్, యూపీఐ చెల్లింపుల డేటాకు వారు ఇచ్చిన డిక్లరేషన్లు, ఖర్చులకు సరిపోలలేదని ఐటీ శాఖ తెలిపింది. ప్రస్తుతం పంపిన నోటీసులకు టాక్స్ చెల్లింపుదారులు స్పందించకపోతే అప్పుడు అధికారులు డిమాండ్ నోటీసులు పంపుతారు.

మరి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఇలా ఐటీ నోటీసులు వచ్చినట్టైతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఐటీ శాఖ నుంచి నోటీస్ రాగానే ముందుగా మీరు చేయాల్సిందల్లా వచ్చిన ఆ నోటీసుని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. నోటీసులు వేరు వేరు కారణాలతో వస్తాయి. ముందుగా మీకు వచ్చిన నోటీసు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఒక్కోసారి మిస్ అయిన డాక్యుమెంట్స్ సమర్పించమని లేదా ఆడిట్‌కి సంబంధించిన సమాచారం ఇవ్వాలని లేకుంటే ఒక్కోసారి ఇది రొటీన్ కమ్యూనికేషన్ కావచ్చు. అయితే, నోటీస్ రాగానే పట్టించుకోకుండా వదిలేయొద్దు. అలా నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి పెనాల్టీలు చెల్లించడం, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవడం వంటి పరిస్థితులు ఎదురు కావచ్చు.

ITR Verification : ఇన్​కం టాక్స్ రీఫండ్​ కావాలా?.. ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్​ తప్పనిసరి.. గడువు 30 రోజులే!

నోటీసు వచ్చిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి సమాధానం ఇవ్వండి. మీరు ఒకవేళ నోటీసులో ఉన్న అంశాలతో ఏకీభవిస్తే.. టాక్స్ చెల్లించండి. నోటీసును మీరు వ్యతిరేకిస్తే.. అంటే మీరు నోటీసులో ఉన్న అంశాలు సరైనవి కావు అని భావిస్తే.. దానిని నిరూపించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫైనాన్షియల్ రికార్డ్ మొదలైన అన్ని అవసరమైన పత్రాలను సేకరించండి నోటీసులో పేర్కొన్న నిర్ణీత గడువులోగా మీరు తప్పకుండా స్పందించాలి. డిపార్ట్‌మెంట్‌తో మీరు జరిపే సంప్రదింపుల్ని సేవ్ చేసుకోవాలి.

How to Check Income Tax Refund Status : మీ 'ఐటీ రిఫండ్ స్టేటస్'.. ఈజీగా ఇలా తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details