Google Pay Transactions Limit per Day How to Increase: గూగుల్ పే "లిమిట్" వేధిస్తోందా..? ఇలా పెంచుకోండి..!
How to Increase Google Pay Transactions Limit : పొద్దున పాల ప్యాకెట్ నుంచి మొదలు పెడితే.. ప్రతిదానికీ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు చాలామంది. ఇలాంటి వారికి UPI యాప్స్ పెట్టిన "లిమిట్" ఇబ్బందిగా మారింది. రోజుకు ఇన్నిసార్లకు మించి యాప్ వాడడానికి వీళ్లేకపోవడంతో అత్యవసర సమయంలో సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ లిమిట్ పెంచుకోవచ్చని మీకు తెలుసా..?
Google Pay Transactions Limit per Day How to Increase
Google Pay Transactions Limit per Day:ప్రస్తుత కాలంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్.. విపరీతంగా పెరిగిపోయాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్‌తోనే రోజూవారి లావాదేవీలు జరుగుతున్నాయి. చివరకు.. సింగిల్ డిజిట్ అమౌంట్ కూడా యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. UPI యాప్స్ ట్రాన్సాక్షన్స్ విషయంలో పరిమితి విధించాయి.
GPay Limit Per Day:భారతదేశంలోని వినియోగదారులు.. ఒక రోజులో గూగుల్ పే నుంచి రూ.లక్ష వరకే డబ్బు పంపించే అవకాశం ఉంటుంది. అంతకు మించి పంపేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ సక్సెక్ కాదు. అంతేకాదు.. ఒక రోజులో ఎన్నిసార్లు జీపేను ఉపయోగించాలనే విషయంలోనూ లిమిట్ ఉంది. గూగుల్ పే వినియోగదారులు ఒక రోజులో 10సార్లు మాత్రమే మనీ సెండ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ చేయాలంటే.. కచ్చితంగా 24 గంటల సమయం వరకు వేచి ఉండాలి.
UPI యాప్‌లలో రోజుకు UPI పరిమితి:
UPI Limit Per Day Across UPI Apps:ఇక యూపీఐ లావాదేవీలను లెక్కలోకి తీసుకుంటే.. ఒక రోజులో 20 సార్లు డబ్బు పంపించవచ్చు. అంటే.. ఉదాహరణకు మీ బ్యాంక్ అకౌంట్‌కు గూగుల్ పే, ఫోన్ పే, మరో యూపీఐ యాప్‌ను లింక్ చేశారనుకుందాం. గూగుల్ పే ద్వారా 10 సార్లు.. మిగిలిన రెండు యాప్‌ల ద్వారా పది పది చొప్పున 20 సార్లు.. మొత్తం 30 సార్లు డబ్బు పంపిస్తామంటే కుదరదు. ఎన్నీ యూపీఐ యాప్స్ వాడినా.. రోజులో 20 సార్లు మాత్రమే లావాదేవీలు జరపడానికి అవకాశం ఉంది.
Google Pay పరిమితిని ఎలా పెంచాలి?
How to Increase Google Pay Limit?:గూగుల్ పే లావాదేవీల పరిమితి పెంచుకోవాలంటే మాత్రం ఒక అవకాశం ఉంది. అయితే.. అది సాధారణ వ్యక్తులకు కాదు. వ్యాపారానికి సంబంధించిన విషయమైతే వెసులుబాటు ఉంటుంది. దీనికోసం.. కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు యూపీఐ పరిమితిని పెంచమని అభ్యర్థించవచ్చు. మీరు గూగుల్ పే కస్టమర్ సర్వీస్‌తో మాట్లాడటానికి అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి సహాయం పొందవచ్చు. ముందు అధికారిక వెబ్‌సైట్ https://support.google.com/ ఓపెన్ చేయాలి. అనంతరం పేజ్‌ను కిందకు స్క్రోల్ చేసి GPay ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ సమస్యను వివరిస్తూ.. చాట్ చేయవచ్చు.
Google Pay Transactions Limits for Different Banks: