తెలంగాణ

telangana

ETV Bharat / business

హైదరాబాద్​ గూగుల్​లో ఆయన 'స్టార్'​ పెర్ఫామర్.. అయినా లేఆఫ్​తో బిగ్ షాక్ - స్టార్ పెర్ఫామర్​ను తొలగించిన గూగుల్​

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో గూగుల్​ కూడా 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. అందులో హైదరాబాద్ గూగుల్​లో ఫిబ్రవరిలో స్టార్ పెర్ఫామర్​గా ఉన్న ఓ ఉద్యోగిని సైతం తొలగించింది.

google layoffs 2023
గూగుల్ ఉద్యోగులకు షాక్

By

Published : Feb 27, 2023, 1:44 PM IST

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. అయితే గూగుల్​ కూడా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. అందులో హైదరాబాద్​ గూగుల్​కు చెందిన స్టార్ పెర్ఫామర్​ కూడా ఉన్నారు. హర్ష్ విజయ్​వర్గీయ ఫిబ్రవరిలో హైదరాబాద్​ గూగుల్​లో స్టార్ పెర్ఫామర్​గా నిలిచారు. అయినా ఆయనను తొలగిస్తున్నట్లు సంస్థ నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారి ఆయన నిరాశకు గురయ్యారు.

'నా జీతం గత రెండు నెలలుగా సగానికి పడిపోయింది.. దీంతో నా ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేను ఫిబ్రవరిలో స్టార్ పెర్ఫార్మర్​గా ఉన్నా. నన్ను ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించారో అర్థం కావడం లేదు.' అని హర్ష్ విజయవర్గీయ లింక్డిన్​లో రాసుకొచ్చారు. శనివారం గూగుల్ కార్యాలయం నుంచి మెయిల్​ వచ్చిందని.. అందులో తనను తొలగిస్తున్నట్లు ఉందని వాపోయారు.

డెల్ ఉద్యోగులకూ షాక్..​
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ టెక్నాలజీస్​ సంస్థ కూడా ఇటీవల తమ సంస్థలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 6,650 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 5 శాతం అని కంపెనీ కో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ క్లార్క్‌ వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్​లోనూ..
సాఫ్ట్​వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్​ కొన్నాళ్ల క్రితం 600 ఉద్యోగులను తొలగించింది. ఇన్ఫోసిస్​ నిర్వహించిన ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ) టెస్ట్​లో ఫెయిలైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది 2022 జులైలో నియమితులైనవారేనని తెలిపింది.

ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్​లోనూ..
ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్ కూడా ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నష్టాల కారణంగా ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఫిలిప్స్‌ తెలిపింది. 3 నెలల క్రితమే ఆ సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించగా.. తాజాగా 6 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.

ABOUT THE AUTHOR

...view details