Google Employees Salary Leaked : దిగ్గజ సంస్థ గూగుల్‌లో ఉద్యోగం అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ.లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం ఉంటుందని అనుకుంటారు. తాజాగా గూగుల్‌లో పనిచేసే ఉద్యోగుల జీతం లెక్కలను అమెరికాకు చెందిన బిజినెస్ ఇన్సైడర్ అనే వెబ్సైట్ లీక్ చేసింది. 2022లో గూగుల్ ఉద్యోగుల సగటు వేతనం 279,802 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.2.30 కోట్లు) అని వెల్లడించింది.
Google Highest Salary : ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. గూగుల్‌లో అత్యధికంగా జీతాన్ని తీసుకుంటున్నారు. ఆ తర్వాత బిజినెస్ అనలిస్ట్‌లు, సేల్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఉన్నారని బిజినెస్ ఇన్సైడర్ తెలిపింది. 2022కు సంబంధించి గూగుల్‌లో వేర్వేరు విభాగాల్లో ఉద్యోగులకు ఇస్తున్న అత్యధిక వార్షిక వేతనం వివరాలు ఇలా ఉన్నాయి..
- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (రూ. 5.90 కోట్లు)
- ఇంజినీరింగ్ మేనేజర్ (రూ. 3.28 కోట్లు)
- ఎంటర్‌ప్రైజ్ డైరెక్ట్ సేల్స్ (రూ. 3.09 కోట్లు)
- లీగల్ కార్పొరేట్ కౌన్సెల్ (రూ. 2.62 కోట్లు)
- సేల్స్ స్ట్రాటజీ (రూ. 2.62 కోట్లు)
- ప్రభుత్వ వ్యవహారాలు అండ్ పబ్లిక్ పాలసీ (రూ. 2.56 కోట్లు)
- రీసెర్చ్ సైంటిస్ట్ (రూ. 2.53 కోట్లు)
- క్లౌడ్ సేల్స్ (రూ. 2.47 కోట్లు)
- ప్రోగ్రామ్ మేనేజర్ (రూ. 2.46 కోట్లు)