తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్​కు భారీ జరిమానా.. ఆ నేతకు రూ.4కోట్లు చెల్లించాలని ఆదేశం! - పరువు నష్టం దావా

Google defamation Australia: గూగుల్​కు ఆస్ట్రేలియా కోర్టు భారీ జరిమానా విధించింది. ఓ రాజకీయ నాయుకుడికి సుమారు రూ.4 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. వివాదాస్పద వీడియోల కారణంగా ఆ నేత రాజకీయాలను వీడాల్సి వచ్చిందని పేర్కొంది.

Google defamation Australia
గూగుల్​కు భారీ జరిమానా

By

Published : Jun 6, 2022, 4:32 PM IST

Google defamation Australia: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ గూగుల్‌కు ఆస్ట్రేలియాలోని ఓ కోర్టు గట్టి షాకిచ్చింది. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్‌లో వైరల్‌ అయిన వివాదాస్పద వీడియోల కారణంగా ఆయన రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, అందువల్ల ఆ నేతకు 5,15,000 డాలర్లు(దాదాపు రూ.4కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.

ఏం జరిగింది?:ఆస్ట్రేలియాలోని న్యూ పౌత్‌ వేల్స్‌ డిప్యూటీ ప్రీమియర్‌గా ఉన్న జాన్‌ బరిలారోను విమర్శిస్తూ.. జోర్డాన్‌ శాంక్స్‌ అనే రాజకీయ విశ్లేషకుడు 2020 చివర్లో యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు పోస్ట్‌ చేశారు. ఎలాంటి ఆధారాలు చూపించనప్పటికీ.. జాన్‌పై శాంక్స్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే 2021 అక్టోబరులో జాన్‌ రాజకీయాలను వీడారు. ఈ వ్యవహారం కాస్తా ఫెడరల్‌ కోర్టుకు చేరగా.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.

"జాన్‌కు వ్యతిరేకంగా అప్‌లోడ్‌ చేసిన యూట్యూబ్‌ వీడియోల ద్వారా గూగుల్‌ వేలాది డాలర్లు ఆర్జించింది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా పదేపదే జాన్‌ను అవినీతిపరుడంటూ ఆరోపణలు చేయడం.. విద్వేష ప్రసంగం కంటే తక్కువేమీ కాదు. గూగుల్‌, శాంక్స్‌ ప్రచార వీడియోల కారణంగానే జాన్‌ 2021 అక్టోబరులో శాశ్వతంగా రాజకీయాలను వీడాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో గూగుల్ తీరు సమర్థనీయం కాదు. జాన్‌ పరువుకు భంగం కలిగించినందుకు గానూ గూగుల్‌ ఆయనకు 7,15,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(5,15,00 అమెరికన్‌ డాలర్లు) చెల్లించాలి"

- ఫెడరల్‌ కోర్టు

రాజకీయ నాయకుడికి రూ.4 కోట్లు చెల్లించాలని ఫెడరల్​ కోర్టు ఇచ్చిన తీర్పుపై గూగుల్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2020లో శాంక్స్‌ ఈ వీడియోలు పోస్ట్‌ చేయగా.. దాదాపు 8లక్షల వ్యూస్‌ వచ్చాయి.

ఇదీ చూడండి:'ఠాగూర్​, కలాం ఫొటోలతో కరెన్సీ నోట్లు!'.. ఆర్​బీఐ క్లారిటీ

సంపాదన మొత్తం ఈఎంఐలకే పోతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!

ABOUT THE AUTHOR

...view details