Google CEO Sundar Pichai Success Secret :ప్రతి మగవాని విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనే ఒక నానుడి ఉంది. అది అక్షరాలా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు సరిపోతుంది. చాలా మందికి సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ మాత్రమే తెలుసు. కానీ ఆయన గూగుల్ సీఈఓ అవ్వడం వెనుక ఒక మహిళామూర్తి ఉందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె మరెవరో కాదు సుందర్ పిచాయ్ భార్య అంజలి.
గూగుల్ వద్దనుకున్న సుందర్ పిచాయ్!
ఒకానొక సందర్భంలో సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థ నుంచి వైదొలగాలని అనుకున్నారు. కానీ ఆయనను అంజలి పిచాయ్ వారించారు. అది ఎందుకో తెలుసుకునే ముందు.. అంజలి పిచాయ్ గురించి తెలుసుకుందాం.
బాల్యం
Anjali Pichai Childhood : అంజలి పిచాయ్ రాజస్థాన్‌లోని కోటాలో 1971 జనవరి 11న జన్మించారు. ఆమె తండ్రి పేరు ఓలారాం హర్యానీ. ఆమె సొంత తల్లి పేరు మాత్రం తెలయదు. సవతి తల్లి మాధురీ శర్మ. అంజలికి అమిత్ హర్యానీ అనే సోదరుడు ఉన్నాడు.
విద్యాభ్యాసం
Anjali Pichai Education :అంజలి తన స్వస్థలమైన కోటా గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తరువాత ఖరగ్పుర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆమెది 1989-93 బ్యాచ్.
ఉద్యోగ జీవితం
Anjali Pichai Career :ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత అంజలి.. ఫేమస్ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ కంపెనీలో ఆమె బిజినెస్ అనలిస్ట్‌గా 3 ఏళ్లు పనిచేసి, మంచి అనుభవం సంపాదించారు. తరువాత ఆమె అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ Intuitలో చేరారు. అక్కడ ఆమె బిజినెస్ ఆపరేషన్ మేనేజర్‌గా వర్క్ చేశారు.
ప్రేమ పక్షులు
Anjali Pichai Love Story :సుందర్ పిచాయ్, అంజలి ఇద్దరూ కూడా ఖరగ్‌పుర్ ఐఐటీలోనే కలుసుకున్నారు. ఇద్దరూ క్లాస్మేట్స్ కావడం వల్ల, వారి మధ్య స్నేహం మొదలైంది. తరువాత వారి మనస్సులు కలిసి ప్రేమలో పడ్డారు. చదువు పూర్తియిన తరువాత సుందర్ పిచాయ్ అమెరికా వెళ్లిపోయారు. అంజలి మాత్రం ఇండియాలోనే వర్క్ చేశారు. కానీ వారి ప్రేమకు ఎలాంటి ఆటంకం రాలేదు. ఇద్దరూ తమ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. అబ్బాయి పేరు కిరణ్, అమ్మాయి కావ్య.
భార్య అంజలితో సుందర్ పిచాయ్ గూగుల్ నుంచి వైదొలగాలని అనుకున్న సుందర్!
How Does Sundar Pichai Become CEO Of Google :చాలా మందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ అయిన విషయం మాత్రమే తెలుసు. కానీ, ఆయన ఓ సందర్భంలో గూగుల్ సంస్థ నుంచి వైదొలగాలని అనుకున్నారు. మీరు చదువుతున్నది నిజమే. ఎందుకంటే అప్పటికి సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఒక ఉన్నత ఉద్యోగి మాత్రమే. కానీ, ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆయనకు సీఈఓ పోస్టును ఆఫర్ చేసింది. ట్విట్టర్ కూడా ఆయనకు ఓ కీలకమైన పోస్టింగ్ ఇస్తామని ముందుకు వచ్చింది. అందుకే సుందర్ పిచాయ్ వాటిలో ఒకదానిని ఎంచుకోవాలని భావించారు.
సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని అంజలికి చెప్పగానే.. ఆమె వద్దు అని వారించారు. గూగుల్లోనే ఆయనకు మంచి భవిష్యత్ ఉంటుందని సలహా ఇచ్చారు. ప్రియమైన భార్య చెప్పిన సలహాను మనస్ఫూర్తిగా అంగీకరించిన సుందర్ పిచాయ్.. గూగుల్లోనే కొనసాగారు. కొంత కాలం తరువాత, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఆయనను గూగుల్ సీఈఓగా నియమించింది. నేడు ఆయన ఒక రోజుకు రూ.5 కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నారు. విజయవంతంగా కంపెనీని నడిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అంజలి పిచాయ్ అని చెప్పకతప్పదు. అర్థం చేసుకునే భార్య ఉంటే.. మగవానికి విజయానికి తిరుగుండదు అని చెప్పడానికి ఇదే చక్కని ఉదాహరణ.
Ratan Tata Leadership : రతన్ టాటాకు గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపులు.. అసలు ఏం జరిగింది?
Big Bull Rakesh Jhunjhunwala : రూ.5 వేల నుంచి రూ.44 వేల కోట్ల సంపద సృష్టి.. ఇలా చేస్తే సాధ్యం!
Bisleri Vice Chairperson : వేల కోట్ల వ్యాపారం చేస్తూ.. టాటా, అంబానీలకు సవాల్ విసురుతున్న అమ్మాయి!