తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? ఇలా చేస్తే సెట్! - రుణ వాయిదాలు

Credit score increase: బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు క్రెడిట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. అందువల్ల ఒక వ్యక్తి ఆర్థికారోగ్యం ఎలా ఉందో క్రెడిట్ స్కోరు చెప్పేస్తుంది. మంచి క్రెడిట్‌ స్కోరున్న వారికి రుణాలు సులభంగా లభిస్తాయి. అయితే మీ క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి తెలుసుకోండి.

credit score
క్రెడిట్ స్కోరు

By

Published : Jul 31, 2022, 2:24 PM IST

Credit score increase: ఒక వ్యక్తి ఆర్థికారోగ్యం ఎలా ఉందో క్రెడిట్‌ స్కోరు చెప్పేస్తుంది. 300-900 మధ్య ఉండే ఈ స్కోరు రుణం తీసుకోబోయే వ్యక్తి ఎంత క్రమశిక్షణతో ఉన్నారన్నది తెలియజేస్తుంది. దీన్ని గణించడంలో క్రెడిట్‌ బ్యూరోలు ఎన్నో అంశాలను పరిగణనలోనికి తీసుకుంటాయి. ఎప్పటి నుంచి రుణం తీసుకుంటున్నారు, చెల్లింపుల చరిత్ర, రుణాల గురించి చేసిన సంప్రదింపులు తదితరాలన్నీ దీన్ని ప్రభావితం చేస్తాయి. మంచి క్రెడిట్‌ స్కోరున్న వారికి రుణాలు సులభంగా లభిస్తాయి. కాబట్టి, మీ స్కోరు తక్కువగా ఉంటే.. దీన్ని పెంచుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

రుణ వాయిదాలు సకాలంలో చెల్లించడం ఎప్పుడూ మంచిదే. క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసే అంశాల్లో ఇదే ప్రధానం. ఒక్కసారి గడువు మీరినా.. స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే, చెల్లింపులు సకాలంలో ఉండేలా చూసుకోవాలి. వ్యక్తి ఆర్థిక సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది.

  • క్రెడిట్‌ కార్డుల పరిమితిని పూర్తిగా వినియోగించుకోవద్దు. ఒకటి రెండుసార్లు ఇబ్బందేమీ ఉండదు. కానీ, పలుమార్లు ఇలా జరిగితే.. అప్పుల కోసం ఎదురుచూస్తున్నట్లు బ్యాంకులు భావిస్తాయి. దీంతో క్రెడిట్‌ స్కోరూ కాస్త తగ్గుతుంది.
  • హామీలేని రుణాలను ఎక్కువగా తీసుకోవద్దు. వీటితోపాటు, హామీ ఉండే అప్పులూ ఉండాలి. ఇవి రెండూ సమతౌల్యంగా ఉన్నప్పుడే క్రెడిట్‌ స్కోరు అధికమవుతుంది.
  • క్రెడిట్‌ నివేదికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. దీనివల్ల ఏదైనా వాయిదాలు మర్చిపోయినా.. లేదా మీకు సంబంధం లేని రుణాలు, క్రెడిట్‌ కార్డులు మీ పేరుపైన ఉన్నాయా అన్న సంగతి తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు మన ధ్రువీకరణలను మోసపూరిత వ్యక్తులు వాడి, అప్పులు, క్రెడిట్‌ కార్డులు తీసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. క్రమం తప్పకుండా నివేదికను గమనించినప్పుడే ఇలాంటి విషయాలు బయటపడతాయి.

అపోహలు వీడాలి..
ఒకప్పుడు క్రెడిట్‌ స్కోరు బ్యాంకులు, రుణ సంస్థలు మాత్రమే పరిశీలిస్తాయనే అపోహతో చాలామంది ఉంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీమా సంస్థలు, పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ నెంబరు తీసుకోవాలనుకున్నప్పుడు టెలికాం కంపెనీలూ మీ స్కోరును పరిశీలిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను తీసుకునేటప్పుడూ క్రెడిట్‌ నివేదికలను పరిశీలిస్తున్నాయి.

  • క్రెడిట్‌ నివేదికలను తరచూ తనిఖీ చేసుకోవడం వల్ల స్కోరు తగ్గుతుందనేది అపోహ. వాస్తవం ఏమిటంటే.. క్రెడిట్‌ స్కోరును తెలుసుకోవడాన్ని బ్యాంకులు రుణం కోసం అభ్యర్థనగా పరిగణించవు. కాబట్టి, క్రెడిట్‌ స్కోరుపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి క్రెడిట్‌ బ్యూరో ఏడాదికోసారి వినియోగదారులకు ఒకసారి ఉచితంగా నివేదికను అందిస్తాయి.
  • ఆదాయం అధికంగా ఉంటే.. స్కోరు పెరుగుతుందనీ చాలామంది అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. నివేదికలో ఎక్కడా మీ ఆదాయాన్ని ప్రస్తావించరు. కేవలం మీరు తీసుకున్న అప్పులు, వాటిని చెల్లిస్తున్న తీరే క్రెడిట్‌ స్కోరుకు ప్రాతిపదిక అనేది గుర్తుంచుకోండి.

- సుభ్రాంగ్షు ఛటోపాధ్యాయ్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, క్రిఫ్‌ హై మార్

ఇవీ చదవండి:'ఆ నిర్ణయం తప్పు.. పన్ను ఎగ్గొట్టేందుకు గోల్డ్​ స్మగ్లింగ్ పెరగొచ్చు'

ముదురుతున్న వివాదం.. ట్విట్టర్​పై ఎలాన్​ మస్క్​ కౌంటర్ దావా

ABOUT THE AUTHOR

...view details