తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర, రూ లక్ష కోట్లకు పసిడి దిగుమతులు

Gold Rate Today ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా తగ్గింది. మరోవైపు, దేశంలో ఏప్రిల్‌-జులై మధ్య పసిడి దిగుమతులు భారీగా పెరిగి దాదాపు రూ.1.02 లక్షల కోట్లకు చేరాయి.

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

By

Published : Aug 19, 2022, 1:15 PM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.53,430 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర భారీగా రూ.2000 తగ్గి ప్రస్తుతం రూ.57,508 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,430 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,508 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,430 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,508గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,430 గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,508 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,430 గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,508 వేల వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,754 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.29 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ రూ.86,063 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,32,234 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.1,52,160
ఇథీరియం రూ.1,63,800
టెథర్ రూ.85.98
బినాన్స్​ కాయిన్ రూ.24,936
యూఎస్​డీ కాయిన్ రూ.87.75

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 556 పాయింట్ల నష్టంతో 59 వేల 731 వద్ద, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 17 వేల 778 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎల్​టీ, ఇన్ఫీ, టీసీఎస్​, విప్రో, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​ స్వల్ప లాభాల్లో రాణిస్తున్నారు. భారతీ ఎయిర్​టెల్​, ఎన్టీపీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, భారత్‌ పెట్రోలియం, హీరో మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

ఏప్రిల్‌-జులైలో భారీ పెరిగిన బంగారం దిగుమతులు..
Gold Imports: దేశ కరెంటు ఖాతా లోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఏప్రిల్‌-జులై మధ్య 6.4 శాతం పెరిగి 12.9 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.02 లక్షల కోట్లు)కు చేరాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతుల విలువ 12 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జులై నెలలో మాత్రం దిగుమతులు 43.6 శాతం తగ్గి 2.4 బిలియన్‌ డాలర్లుగా నమోదవ్వడం గమనార్హం.

ఏప్రిల్‌-జులై మధ్య బంగారం, చమురు దిగుమతులు గణనీయంగా పెరగడం వల్ల వాణిజ్య లోటు రికార్డు స్థాయి అయిన 30 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 10.63 బిలియన్‌ డాలర్లుగా ఉండింది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం భారత్‌. ముఖ్యంగా ఆభరణాల కోసం దేశంలోకి భారీ ఎత్తున పసిడి దిగుమతి అవుతూ ఉంటుంది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రత్నాభరణాల ఎగుమతులు 7 శాతం పెరిగి 13.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. భారీ వాణిజ్య లోటు వల్ల 2021-22లో దేశ కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.2 శాతానికి చేరింది. అదే 2020-21లో కరెంటు ఖాతాలో మిగులు నమోదవ్వడం గమనార్హం. 2021 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 22.2 బిలియన్‌ డాలర్లతో జీడీపీలో 2.6 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి జీడీపీలో 1.5 శాతానికి తగ్గి 13.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. దేశ దిగుమతుల విలువ.. ఎగుమతుల విలువ కంటే ఎక్కువుంటే అప్పుడు దేశ కరెంటు ఖాతాలో లోటు ఏర్పడుతుంది.

ఇవీ చదవండి:ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా, ఏం జరిగిందో తెలుసుకోండి మరి

కాయిన్స్​తో కోట్ల మోసం, స్టేట్​ బ్యాంక్​లో భారీ స్కామ్​, రంగంలోకి సీబీఐ

ABOUT THE AUTHOR

...view details