తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today

By

Published : Mar 14, 2023, 10:18 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి.. ప్రస్తుతం రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 2,600 పెరిగి.. ప్రస్తుతం రూ.68,100 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.59,400గా ఉంది. కిలో వెండి ధర రూ.68,100 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,100గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,400 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,100 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,100గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1903.40 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.67 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్ ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.20,06,497 పలుకుతుండగా.. ఇథీరియం, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మరికొన్నింటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.20,06,497
ఇథీరియం రూ.1,38,012
టెథర్​ రూ.82.74
బైనాన్స్​ కాయిన్​ రూ.25,177
యూఎస్​డీ కాయిన్ రూ.82.29

లాభాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య ఊగిసలాట మధ్య స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం 58,361 వద్ద కదలాడుతోంది. మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం స్వల్ప లాభాల్లో ఉంది. 21 పాయింట్ల ల్ప లాభంతో 17,170 వద్ద సూచీ ట్రేడవుతోంది. సెన్సెక్స్​లోని 30 షేర్లలో టైటాన్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్​టెల్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. టెక్ మహీంద్ర అత్యధికంగా 2.2 శాతానికి పైగా నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, కోటక్ బ్యాంక్, హెచ్​సీఎల్ టెక్ షేర్లు డీలా పడ్డాయి. మరోవైపు, అదానీ షేర్లు మళ్లీ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేరు భారీగా పతనమవుతున్నాయి. అదానీ పవర్ షేరు లోయర్ సర్క్యూట్​ను తాకింది.

రూపాయి విలువ
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం పతనమైంది. ప్రస్తుతం ట్రేడింగ్​లో నాలుగు పైసలు కోల్పోయి 82.27 వద్ద ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details