Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.80 పెరిగి రూ.57,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.130 పెరిగి ప్రస్తుతం రూ.66,670 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.57,950గా ఉంది. కిలో వెండి ధర రూ.66,670 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,670గా ఉంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,950 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,670 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.66,670గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1855 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.29 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్ ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.