తెలంగాణ

telangana

ETV Bharat / business

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rates in telugu states
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

By

Published : Mar 3, 2023, 12:47 PM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.20 పెరిగి రూ.57,820 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.50 పెరిగి.. ప్రస్తుతం రూ.65,932 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,820గా ఉంది. కిలో వెండి ధర రూ.65,932 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,820 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,932గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,820 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,932 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,820 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,932గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1843.05 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.05 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్ ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,39,810 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.18,39,810
ఇథీరియం రూ.1,28,954
టెథర్​ రూ.82.30
బైనాన్స్​ కాయిన్​ రూ.23,880
యూఎస్​డీ కాయిన్ రూ.82.87

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 503.56 పాయింట్లు లాభపడి 59,412.91 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 157.15 పాయింట్లు లాభపడి 17,479.05 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, పవర్​ గ్రిడ్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఎన్టీపీసీ, హెచ్​సీఎల్ టెక్నాలజీస్​, భారతి ఎయిర్​టెల్​, ఐటీసీ, మహీంద్ర అండ్​ మహీంద్ర, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏసియన్​ పెయింట్స్​ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం విలువ
రూపాయి మారకం విలువడాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 36 పైసలు తగ్గి 82.24 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details