తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఇవే..
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?
gold price today
By
Published : Feb 15, 2023, 9:54 AM IST
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి.. ప్రస్తుతం రూ.58,500 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.800 తగ్గి.. ప్రస్తుతం రూ.67,800 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,500 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,800 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,500 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,800 గా ఉంది.
Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,500 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,800 వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,500 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.67,800 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1847.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.74 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.17,91,103 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.17,91,103
ఇథీరియం
రూ.1,20,913
టెథర్
రూ.82.75
బైనాన్స్ కాయిన్
రూ.24,108
యూఎస్డీ కాయిన్
రూ.82.57
స్టాక్ మార్కెట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ 222 పాయింట్ల నష్టంతో 60,809 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 17,869 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ, టైటన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రూపాయి విలువ.. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.90 దగ్గర ట్రేడవుతోంది.