స్పల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా..
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?
Gold Rate Today
By
Published : Feb 13, 2023, 9:54 AM IST
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి.. ప్రస్తుతం రూ.58,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర కూడా రూ.500 తగ్గి.. ప్రస్తుతం రూ.68,100 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,800 గా ఉంది. కిలో వెండి ధర రూ.68,100 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,100 గా ఉంది.
Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,800 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,100 వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,800 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,100 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1858.05 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.84 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.17,95,168 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.17,95,168
ఇథీరియం
రూ.1,24,360
టెథర్
రూ.82.51
బైనాన్స్ కాయిన్
రూ.25,304
యూఎస్డీ కాయిన్
రూ.82.49
స్టాక్ మార్కెట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 60,511 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్చ్సేంజీ సూచీ నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 17,817 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో టాటాస్టీల్, టైటాన్, సన్‌ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్టీ, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, కొటాక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లీ ల్యాండ్, హెడ్ఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటర్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రూపాయి విలువ.. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.68 వద్ద ప్రారంభమైంది.