తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా..
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?
Gold Rate Today
By
Published : Feb 10, 2023, 10:05 AM IST
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం రూ.700 తగ్గి.. ప్రస్తుతం రూ.58,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1200 తగ్గి.. ప్రస్తుతం రూ.68,250 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,600 గా ఉంది. కిలో వెండి ధర రూ.68,250 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,250 గా ఉంది.
Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,600 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,250 వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,250 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1858 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.21 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.17,63,618 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.17,63,618
ఇథీరియం
రూ.1,31,175
టెథర్
రూ.82.63
బైనాన్స్ కాయిన్
రూ.26,351
యూఎస్డీ కాయిన్
రూ.82.62
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో 60,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 17,850 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఅండ్ఎం, ఐటీసీ, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, రిలయన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి మారకం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.61 వద్ద ప్రారంభమైంది.