తెలంగాణ

telangana

ETV Bharat / business

హైదరాబాద్​, విజయవాడలో బంగారం ధర ఎంతంటే? - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today
బంగారం

By

Published : Feb 9, 2023, 11:25 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం స్థిరంగా ఉండి.. ప్రస్తుతం రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర స్వల్పంగా రూ.150 తగ్గి.. ప్రస్తుతం రూ.69,450 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.59,300 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,450 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,450 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,300 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,450 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,450 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1880.00 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.44 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,63,618 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.18,63,618
ఇథీరియం రూ.1,34,175
టెథర్​ రూ.82.63
బైనాన్స్​ కాయిన్​ రూ.26,351
యూఎస్​డీ కాయిన్ రూ.82.62

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 72 పాయింట్ల నష్టంతో 60,590 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 17,829 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.
రూపాయి మారకం
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు పడిపోయి 82.66 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details