స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా.. - విశాఖపట్నంలో బంగారం రేటు
Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?
బంగారం
By
Published : Feb 7, 2023, 10:31 AM IST
Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉండి.. ప్రస్తుతం రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర స్వల్పంగా రూ.350 తగ్గి.. ప్రస్తుతం రూ.69,300 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.59,300 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,300 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,300 గా ఉంది.
Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,300 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,300 వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,300 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1873.20 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.33 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.18,93,764 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.18,93,764
ఇథీరియం
రూ.1,35,118
టెథర్
రూ.82.76
బైనాన్స్ కాయిన్
రూ.27,042
యూఎస్డీ కాయిన్
రూ.82.74
స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 60,584 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 17,791 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, టైటన్, టాటా మోటార్స్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి మారకం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 82.66 వద్ద కొనసాగుతోంది.