తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today

By

Published : Jan 24, 2023, 12:09 PM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.365 పెరిగి.. ప్రస్తుతం రూ.59,055 వద్ద ఉంది. కిలో వెండి ధర 635 పడిపోయి.. ప్రస్తుతం రూ. 69,890 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.59,055 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,890 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,055 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,890 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,055 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,890 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.59,055 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,890 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1935.65 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.58 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,85,072 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.18,85,072
ఇథీరియం రూ.1,33,597
టెథర్​ రూ.81.59
బైనాన్స్​ కాయిన్​ రూ.26,095
యూఎస్​డీ కాయిన్ రూ.81.58

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 273 పాయింట్ల లాభంతో 61,214 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 18,185 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెచ్​సీఎల్​ టెక్​, ఏసియన్ పేయింట్స్​, ఇన్ఫోసిస్​, బజాజ్​ ఫిన్​సెర్వ్, టెక్​ మహీంద్రా, ఇండస్​ ఇండ్ బ్యాంక్, బజాజ్​ ఫైనాన్స్, హెచ్​డీఎఫ్​సీ, మారుతీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్​ గ్రిడ్​, అల్ట్రాటెక్​ సిమెంట్, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

రూపాయి మారకం..
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 26 పైసలు తగ్గి 81.68 వద్ద ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details