తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold rate today
gold rate today

By

Published : Jan 2, 2023, 10:18 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి.. ప్రస్తుతం రూ.56,800వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.208 అధికమై.. ప్రస్తుతం రూ.70,500కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,800గా ఉంది. కిలో వెండి ధర రూ.70,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,500గా ఉంది.
  • Gold price in Visakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,800 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,500గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1824.10 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.98 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,73,690 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.13,73,690
ఇథీరియం రూ.99,142
టెథర్​ రూ.82.48
బైనాన్స్​ కాయిన్​ రూ.20,090
యూఎస్​డీ కాయిన్ రూ.82.60

మార్కెట్లు డీలా...
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త సంవత్సరాన్ని స్తబ్దుగా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడం వల్ల సూచీలు మందకొడిగా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 55 పాయింట్ల నష్టంతో 60,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 18,090 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.60 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details