తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే? - ఈ రోజు క్రిప్టోకరెన్సీల ధరలు న్యూస్

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold-rate-today-in-hyderabad-and-vijayawada
బంగారం

By

Published : Dec 29, 2022, 11:05 AM IST

Updated : Dec 29, 2022, 11:33 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి ప్రస్తుతం రూ.56,260వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.200 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,060 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,260 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,060 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,260 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,060 గా ఉంది.
  • Gold price in Vijayawada: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,260 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,060 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,260 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,060 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1809.30 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.72 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,69,235 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.13,69,235
ఇథీరియం రూ.98,587
టెథర్​ రూ.82.76
బైనాన్స్​ కాయిన్​ రూ.20,274
యూఎస్​డీ కాయిన్ రూ.82.80

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 245 పాయింట్ల నష్టంతో 60,664 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 18,054 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి విలువ:
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.75 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Dec 29, 2022, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details