Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.20 తగ్గి ప్రస్తుతం రూ.56,140 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.235పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,260 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.56,140గా ఉంది. కిలో వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,140 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,260గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,140గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,140వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,260 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1805.20 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.90 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.