స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే? - rupee value
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం,వెండి ధరలు
By
Published : Dec 19, 2022, 11:32 AM IST
|
Updated : Dec 19, 2022, 12:56 PM IST
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం రూ.115 మేర పెరిగి ప్రస్తుతం రూ.55,890 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 180 పెరిగి.. ప్రస్తుతం రూ.68,844 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.55,890గా ఉంది. కిలో వెండి ధర రూ.68,844 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,890 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,844గా ఉంది.
Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,890గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,844వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,890 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,844గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,793.80 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.24 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,79,297 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.13,79,297
ఇథీరియం
రూ.97,645
టెథర్
రూ.82.72
బైనాన్స్ కాయిన్
రూ.20,505
యూఎస్డీ కాయిన్
రూ.82.64
స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఉదయం 10:45 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 61,612 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 18,345 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. రూపాయి విలువ: డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు తగ్గి ప్రస్తుతం రూ. 82.77 వద్ద ఉంది.