తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా - హైదరాబాద్‌లో కిలో బంగారం ధర
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
gold
By
Published : Dec 6, 2022, 11:14 AM IST
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.370 తగ్గి ప్రస్తుతం రూ.55,230 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1432 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.66,868 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.55,230గా ఉంది. కిలో వెండి ధర రూ.66,868 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,230 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,868గా ఉంది.
Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,868వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,230 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.66,868గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.1774.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.40డాలర్ల వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,95,247 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.13,95,247
ఇథీరియం
రూ.1,03,669
టెథర్
రూ.81.87
బైనాన్స్ కాయిన్
రూ.23,721
యూఎస్డీ కాయిన్
రూ.82.21
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు సుదీర్ఘకాలం కొనసాగించనుందనే అంచనాలతో యూఎస్ సూచీలు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో భారీగా పతనమయ్యాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షకు ముందు మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ ప్రభావం దేశీయ సూచీలపై పడింది. ఈ నేపథ్యంలో ఉదయం 9.37 గంటలకు సెన్సెక్స్ 347 పాయింట్లు నష్టపోయి 62,483 వద్ద.. నిఫ్టీ 100 పాయింట్లు క్షీణించి 18,600 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తగ్గిన రూపాయి విలువ.. ట్రేడింగ్‌లో డాలర్కంటే 24 పైసలు తగ్గిన రూపాయి విలువ ప్రస్తుతం రూ. 82.09కు చేరుకుంది.