Gold Rate Today : దేశంలోని పసిడి ధర పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 1,067 పెరిగి ప్రస్తుతం రూ.51,900 గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,568 పెరిగి.. రూ.57,823 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.51,900 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,823గా ఉంది.
- Gold price in Vizag: విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,900 గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,660 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.88 డాలర్ల వద్ద ఉంది.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ప్రారంభంలో 600 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 577 పాయింట్ల లాభంతో 58,988 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 168 పాయింట్లు ఎగబాకి 17,480 వద్ద కదలాడుతోంది. హిందాల్కో, భారతి ఎయిర్టెల్, ఎం&ఎం, ఎంల్&టీ భారీ లాభాల్లో ఉండగా కోల్ ఇండియా, ఎన్టీపీసీ నష్టాల్లో కూరుకుపోయాయి.