భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే! - ప్రొద్దుటూరులో బంగారం వెండి రేట్లు
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?
gold rates today
By
Published : Mar 24, 2023, 12:38 PM IST
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.1,760 పెరిగి.. ప్రస్తుతం రూ.61,110గా ఉంది. కిలో వెండి ధర రూ.1,660 పెరిగి.. ప్రస్తుతం రూ.71,460 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,110వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,460 రూపాయలుగా ఉంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ. 61,110గా ఉంది. కిలో వెండి ధర రూ.71,460 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,110 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,460గా ఉంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,110గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,460 వద్ద ఉంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,986 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.99 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.23,16,406 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.23,16,406
ఇథీరియం
రూ.1,48,608
టెథర్
రూ. 82.30
బైనాన్స్ కాయిన్
రూ.26,757
యూఎస్డీ కాయిన్
రూ.82.17
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య.. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 123 పాయింట్లు నష్టపోయి 57,802 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పడిపోయి.. 17,015 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సెర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటన్, ఏసియన్ పేయింట్స్, నెస్లే, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్&టీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.