తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today

By

Published : May 3, 2023, 11:34 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.2,185 పెరిగి.. ప్రస్తుతం రూ.62,900 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,167 పెరిగి.. ప్రస్తుతం రూ.77,560 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.62,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.77,560 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,900గా ఉంది. కిలో వెండి ధర రూ.77,560 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam : వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,900 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.77,560గా ఉంది.
  • Gold price in Proddatur : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.62,900గా ఉంది. కేజీ వెండి ధర రూ.77,560 వద్ద ఉంది.

బంగారం ధర పెరిగే ఛాన్స్​!
భారతీయులు ఎక్కువగా పెట్టుబడి పెట్టే వాటిలో బంగారం ముఖ్యమైనది. అలంకరణతో పాటు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడడం వల్ల ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. గత ఏడాది కాలంగా చూస్తే బంగారం ధర పెరుగుతూ వస్తోంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేటు పెంపుపై సమావేశంతో పాటు తాజాగా బ్యాకింగ్​ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు మరింత పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల పెంపుదల కొనసాగితే బంగారం ధరపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని బంగారంపై స్వల్పకాలిక పెట్టుబడి కన్నా దీర్ఘకాల పరిమితిలో మెరుగైన ఫలితాలు రావచ్చని అంచనా వేస్తున్నారు.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2,016 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 25.28 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.23,29,436 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.23,29,436
ఇథీరియం రూ.1,52,232
టెథర్​ రూ.81.84
బైనాన్స్​ కాయిన్​ రూ.26,421
యూఎస్​డీ కాయిన్ రూ.81.80

ఇవీ చదవండి:అమెరికాలో మరో బ్యాంకు మూత.. జేపీ మోర్గాన్​కు విక్రయం

EPFO గుడ్​న్యూస్​.. అధిక పింఛను దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?

ABOUT THE AUTHOR

...view details