Gold Rate Today : దేశంలో బంగారం ధర స్పల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.59,340 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దిల్లీలో కిలో వెండి ధర రూ.72,100గా ఉంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ బంగారం సుమారు రూ.675 పెరిగి.. రూ.60,715 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,160 తగ్గి.. రూ.72,160వద్ద ట్రేడవుతోంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,715 ఉంది. కిలో వెండి ధర రూ.రూ.72,160గా ఉంది.
- Gold Price in Vishakhapatnam :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,715గా ఉంది. కిలో వెండి ధర రూ.రూ.72,160గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,715గా ఉంది. కిలో వెండి ధర రూ.రూ.72,160గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Rate : అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1951.50 డాలర్లు ఉండగా.. బుధవారం నాటికి సుమారు 15 డాలర్లు దిగివచ్చి 1936.60 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఔన్స్ వెండి ధర 23.14 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Bitcoin Value : బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.23,57,804 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్ మొదలైన క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,57,804 |
ఇథీరియం | రూ.1,48,577 |
టెథర్ | రూ.82.4 |
బైనాన్స్ కాయిన్ | రూ.20,591 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.7 |
స్టాక్‌మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. కొనుగోలుదార్ల మద్దతుతో హెచ్డీఎఫ్సీ ట్విన్స్, రిలయన్స్ షేర్లు లాభాల బాటపట్టమే ఇందుకు కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ తన జీవితకాల గరిష్ఠం 63 వేల 588.31కి చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 13 పాయింట్లు వృద్ధి చెంది 18,829 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.