తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే? - విజయవాడలో బంగారం ధరలు

Gold Price Today : దేశంలో బంగారం ధర​​ స్థిరంగా ఉండగా.. వెండి ధర​ భారీగా తగ్గింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Stocks Rupee Fuel Rates
స్థిరంగా గోల్డ్​ రేట్​, భారీగా తగ్గిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

By

Published : Jul 28, 2023, 11:12 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర​​ స్థిరంగా ఉంది. వెండి ధర​ భారీగా తగ్గింది. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,162గా ఉండగా.. శుక్రవారం రూ.61,130గా ఉంది. మరోవైపు.. వెండి ధర భారీగా తగ్గింది. గురువారం కిలో వెండి ధర రూ.77,400గా ఉండగా.. రూ.1,710 తగ్గి రూ.75,690కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,130గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,690గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,130గా ఉంది. కిలో వెండి ధర రూ.75,690కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,130గా ఉంది. కిలో వెండి ధర రూ.75,690గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,130గా ఉంది. కిలో వెండి ధర రూ.75,690కు చేరుకుంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్ల నిర్ణయం, విదేశీ వాణిజ్య రుణాల తర్వాత అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధర రోజు వారి రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది. జూన్ చివరి తర్వాత ఇంత కనిష్ఠ స్థాయి ధర నమోదవ్వలేదు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్​ కూడా గురువారం సొంతంగా క్వార్టర్ పాయింట్ రేట్లను పెంచడం వల్ల యూరోతో పోలిస్తే డాలర్​ విలువ కూడా భారీ పెరిగింది. ఇవి కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపాయి. 15 రోజుల కిందటే ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరిన బంగారం విలువ.. ప్రస్తుతం పూర్తి భిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో కనిష్ఠ స్థాయిని చవిచూసింది. కాగా, గ్లోబల్​ మార్కెట్​లో గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1976 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం స్పాట్​ గోల్డ్​ ధర 1953 డాలర్లుగా ఉంది. మరోవైపు ఔన్స్​ వెండి ధర 24.25 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,01,848 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం కూడా నష్టాల్లో ఉంది. టెథర్​, యూఎస్​డీ కాయిన్​, బైనాన్స్ కాయిన్​లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. ​ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,01,848
ఇథీరియం రూ.1,53,083
టెథర్ రూ.82.16
బైనాన్స్ కాయిన్ రూ.19,762
యూఎస్​డీ కాయిన్ రూ.82.30

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today : అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్ల సూచీల మిశ్రమ సంకేతాల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ఆరంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 186 పాయింట్లు నష్టపోయి 66,081 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 43 పాయింట్లు నష్టపోయి 19,617 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
రిలయన్స్​, పవర్​గ్రిడ్​, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​యూఎల్​, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, ఎమ్ అండ్​ ఎమ్​, విప్రో భారతీ ఎయిర్​టెల్​, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :
కోటక్​, సన్​ఫార్మా, ఎల్​ అండ్​ టీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్​, యాక్సిస్​, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకుల స్టాక్​లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది. అమెరికా మార్కెట్లలోని ప్రధాన సూచీలైన డోజోన్స్​, నాస్​డాక్​, ఎస్​అండ్​పీ 500 సూచీలు గురువారం ట్రేడింగ్​ను నష్టాల్లో ముగించడం దేశీయ సూచీలపై కూడా పడింది.

రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 31 పైసలు క్షీణించి రూ.82.23 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details