తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - capsgold

Gold Price Today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర​​లు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Silver And Fuel Rates Today
స్థిరంగా గోల్డ్​ రేట్​.. స్వల్పంగా తగ్గిన వెండి ధర.. ఏపీ తెలంగాణలో ఎంతంటే

By

Published : Jul 25, 2023, 12:31 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,117గా ఉంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం కిలో వెండి ధర రూ.76,250 ఉండగా, రూ.225 తగ్గి రూ.76,025కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,117గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,025గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,117గా ఉంది. కిలో వెండి ధర రూ.76,025కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,117గా ఉంది. కిలో వెండి ధర రూ.76,025గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,117గా ఉంది. కిలో వెండి ధర రూ.76,025కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి గమనించవలెను.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1961 డాలర్లుగా ఉండగా.. మంగళవారం 1963 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి​ ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 24.57 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,78,331 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్​, బైనాన్స్​ కాయిన్​, యూఎస్​డీ కాయిన్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.23,78,331
ఇథీరియం రూ.1,51,085
టెథర్ రూ.81.75
బైనాన్స్ కాయిన్ రూ.19,434
యూఎస్​డీ కాయిన్ రూ.81.77

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today : మంగళవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 41.59 పాయింట్లు నష్టపోయి 66,343 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 3.00 పాయింట్లు క్షీణించి 19,669 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, టాటా మోటార్స్​, ఎన్టీపీసీ, పవర్​గ్రిడ్​, టైటాన్​, మారుతీ​, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, రిలయన్స్​ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :
నెస్లే, ఇండస్ఇండ్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్, హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్, యాక్సిస్​ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, ఐటీసీ, కోటక్​ బ్యాంక్​​ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 14 పైసలు ఎగబాకి రూ.81.67 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.92గా ఉంది. డీజిల్​ ధర రూ.97.78గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details