తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Price Today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని పసిడి, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

Gold Price today
Gold Rate today

By

Published : Jul 3, 2023, 10:58 AM IST

Updated : Jul 3, 2023, 11:03 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల​ బంగారం నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.100 తగ్గి సోమవారం రూ.60,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.125 తగ్గి రూ.71,400గా ఉన్నది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,400గా ఉన్నది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.71,400గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.71,400గా ఉన్నది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.71,400గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరల్లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1922 డాలర్లుగా ఉండగా, సోమవారం నాటికి సుమారు 2 డాలర్లు కోల్పోయి 1920 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 22.86 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ మరింతగా వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.25,11,449 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీలు కూడా లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.25,11,449
ఇథీరియం రూ.1,59,512
టెథర్​ రూ.81.82
బైనాన్స్ కాయిన్ రూ.20,225
యూఎస్​డీ కాయిన్ రూ.81.82

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : సోమవారం దేశీయ స్టాక్​మార్కెట్లు సరికొత్త రికార్డ్​ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ మొదటిసారిగా 65,000 పాయింట్లు మార్కు దాటగా, ఎన్​ఎస్​ఈ కూడా ఆల్​టైమ్​ హై రికార్డు లాభాలతో దూసుకెళ్తోంది. యూస్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతుండడం సహా, విదేశీ పెట్టుబడులు పెరిగిన నేపథ్యమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 458 పాయింట్లు లాభపడి 65,176 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 126 పాయింట్లు వృద్ధి చెంది 19,315 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : హెచ్​డీఎఫ్​సీ, టాటాస్టీల్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ బ్యాంకు
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :పవర్​గ్రిడ్​, మారుతి సుజుకి, యాక్సిస్​ బ్యాంకు, సన్​ఫార్మా, టైటాన్​

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 33 పైసలు పెరిగి రూ.81.77 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

Last Updated : Jul 3, 2023, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details