తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Price today : దేశంలో బంగారం ధరలు క్రమంగా రోజురోజుకూ దిగివస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

gold and silver prices today
Gold Rate today

By

Published : Jun 30, 2023, 11:22 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల​ బంగారం గురువారంతో పోల్చితే సుమారుగా రూ.20 తగ్గి శుక్రవారం రూ.59,930గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సుమారు రూ.150 తగ్గి రూ.71,147గా ఉన్నది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,930గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,147గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,930గా ఉంది. కిలో వెండి ధర రూ.71,147కు చేరింది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,930గా ఉంది. కిలో వెండి ధర రూ.71,147గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.59,930గా ఉంది. కిలో వెండి ధర రూ.71,147కు చేరింది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1908 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 22.68 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ మరింతగా వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.25,14,706 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీ విలువలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.25,14,706
ఇథీరియం రూ.1,52,747
టెథర్​ రూ.82.2
బైనాన్స్ కాయిన్ రూ.19,321
యూఎస్​డీ కాయిన్ రూ.82.5

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : శుక్రవారం దేశీయ మార్కెట్లు ఆల్​ టైమ్​ హై రికార్డులు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం సహా, విదేశీ పెట్టుబడులు పెరిగిన నేపథ్యమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 420 పాయింట్లు లాభపడి 64,336 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 113 పాయింట్లు వృద్ధి చెంది 19,085 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఇన్ఫోసిస్​, టీసీఎస్​, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​ టెక్​, మారుతి సుజుకి, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, ఏసియన్​ పెయింట్స్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, టాటాస్టీల్​

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ దాదాపు స్థిరంగా ఉంది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే రూ.82.02 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది. జులై 1 నుంచి వీటి ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details