Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - డీజిల్ ధరలు
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లోని పసిడి, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.
Gold Rate today and stock market news Today
By
Published : Jun 27, 2023, 11:15 AM IST
Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చితే సుమారుగా రూ.85 పెరిగి, మంగళవారం రూ.60,450గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సుమారు రూ.560 వృద్ధి చెంది రూ.71,675గా ఉన్నది.
Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,450గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,675గా ఉన్నది.
Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,450గా ఉంది. కిలో వెండి ధర రూ.71,675గా ఉంది.
Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,450గా ఉంది. కిలో వెండి ధర రూ.71,675గా ఉన్నది.
Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,450గా ఉంది. కిలో వెండి ధర రూ.71,675గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు కూడా మరింతగా పెరిగాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1925 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి సుమారు 4 డాలర్లు వృద్ధి చెంది 1929 డాలర్లు వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 22.96 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency news : బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,88,408 వద్ద ట్రేడవుతోంది. కానీ ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్ మొదలైన క్రిప్టో కరెన్సీ విలువలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.24,88,408
ఇథీరియం
రూ.1,53,436
టెథర్
రూ.81.89
బైనాన్స్ కాయిన్
రూ.19,501
యూఎస్డీ కాయిన్
రూ.81.97
స్టాక్‌మార్కెట్ న్యూస్ Stock market today : దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నప్పటికీ, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఇన్ఫోసిస్ లాభాలబాట పట్టడం వల్ల దేశీయ మార్కెట్లు కూడా వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 110 పాయింట్లుా లాభపడి 3,080 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 35 పాయింట్లు వృద్ధి చెంది 18,726 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
రూపాయి విలువ Rupee open : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. మంగళవారం రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే 8 పైసలు పెరిగి రూ.81.96 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65గా ఉంది. డీజిల్ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్ ధర రూ.89.66గా ఉంది.