తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా తగ్గిన గోల్డ్​, సిల్వర్​ ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - ounce gold price today

Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today

By

Published : Aug 7, 2023, 10:51 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు​ స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,275గా ఉండగా.. సోమవారం రూ.30 తగ్గి రూ.61,245కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.74,475గా ఉండగా.. రూ.295 తగ్గి సోమవారం రూ.74,180కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,245గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,180గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,245గా ఉంది. కిలో వెండి ధర రూ.74,180కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,245గా ఉంది. కిలో వెండి ధర రూ.74,180గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,245గా ఉంది. కిలో వెండి ధర రూ.74,180కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేటు స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1943 డాలర్లుగా ఉండగా.. సోమవారం 5 డాలర్లు మేరకు తగ్గి 1938 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.53 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి జోరు మీద కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,10,293 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే...

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,10,293
ఇథీరియం రూ.1,52,074
టెథర్ రూ.82.58
బైనాన్స్ కాయిన్ రూ.20,151
యూఎస్​డీ కాయిన్ రూ.82.72

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today : దేశీయ స్టాక్​మార్కెట్లు సోమవారం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నప్పటికీ.. ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ షేర్స్​ కొనుగోలుకు బయ్యర్లు మొగ్గు చూపుతుండడం వల్ల దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 202 పాయింట్లు లాభపడి 65,923 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 57 పాయింట్లు వృద్ధి చెంది 19,574 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :రిలయన్స్, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్​ టీ, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :ఎస్​బీఐ, టైటాన్​, కోటక్​బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, టాటా స్టీల్​, యాక్సిస్ బ్యాంకు

రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు పెరిగి రూ.82.71 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.06 శాతం వరకు తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 86.09 డాలర్లుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details