Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే? - Gold Price in Proddatur
Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధరలు మరలా స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today
By
Published : Jul 29, 2023, 10:53 AM IST
Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు మరలా స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. దీనితో ఒక్కసారిగా దేశంలో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కానీ శనివారం పసిడి ధరలు మరలా స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,130గా ఉండగా శనివారం రూ.315 పెరిగి రూ.61,445కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.75,690గా ఉండగా.. శనివారం రూ170 పెరిగి రూ.75,860కు చేరుకుంది.
Gold Price in Hyderabad :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,445గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,860గా ఉంది.
Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,445గా ఉంది. కిలో వెండి ధర రూ.75,860కు చేరుకుంది.
Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,445గా ఉంది. కిలో వెండి ధర రూ.75,860గా ఉంది.
Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,445గా ఉంది. కిలో వెండి ధర రూ.75,860కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. ఈ విషయం మీరు గమనించవలెను.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్లలోనూ గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1953 డాలర్లుగా ఉండగా.. శనివారం స్పాట్ గోల్డ్ ధర 1959 డాలర్లుగా ఉంది. మరోవైపు ఔన్స్ వెండి ధర 24.36 డాలర్లుకు చేరుకుంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,16,358 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం, బైనాన్స్ కాయిన్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్డీ కాయిన్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.24,16,358
ఇథీరియం
రూ.1,54,184
టెథర్
రూ.82.24
బైనాన్స్ కాయిన్
రూ.19,907
యూఎస్డీ కాయిన్
రూ.82.27
పెట్రోల్, డీజిల్ ధరలు! Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.