Gold Rate Today 3rd October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.59,150 ఉండగా.. మంగళవారం రూ.750 తగ్గి రూ.58,400కి చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ.71,800 ఉండగా.. మంగళవారం రూ.2800 తగ్గి రూ.69,000 చేరుకుంది.
- Gold Price In Hyderabad 3rd October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,400గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.
- Gold Price In Vijayawada 3rd October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,400గా ఉంది. కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 3rd October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,400గా ఉంది. కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.
- Gold Price In Proddatur 3rd October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,400కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 3rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1844 డాలర్లుగా ఉండగా.. మంగళవారం కూడా 1848 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 21 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 3rd October 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,95,595 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,95,595 |
ఇథీరియం | రూ.1,38,617 |
టెథర్ | రూ.83.19 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,916 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.18 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 3rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 347 పాయింట్లు నష్టపోయి 65,481 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 117 పాయింట్లు కోల్పోయి 19,521 వద్ద ట్రేడ్ అవుతోంది.