తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 9:32 AM IST

Updated : Oct 31, 2023, 10:58 AM IST

ETV Bharat / business

Gold Rate Today 31st October 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 31st October 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 31st October 2023
Gold Rate Today 31st October 2023

Gold Rate Today 31st October 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,290 ఉండగా.. మంగళవారం రూ.160 తగ్గి రూ.63,130కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.73,800గా ఉండగా.. మంగళవారం రూ.320 పెరిగి రూ.74,120కు చేరుకుంది..

  • Gold Price In Hyderabad 31st October 2023 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,130గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,120గా ఉంది.
  • Gold Price In Vijayawada 31st October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,130గా ఉంది. కిలో వెండి ధర రూ.74,120కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 31st October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,130గా ఉంది. కిలో వెండి ధర రూ.74,120గా ఉంది.
  • Gold Price In Proddatur 31st October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.63,130గా ఉంది. కిలో వెండి ధర రూ.74,120కు చేరుకుంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 31st October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 2002 డాలర్లుగా ఉండగా.. మంగళవారం 9 డాలర్లు తగ్గి 1993 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరో వైపు సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.19 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 31st October 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.28,56,031 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.28,56,031
ఇథీరియం రూ.1,49,884
టెథర్ రూ.82.28
బైనాన్స్ కాయిన్ రూ.18,906
యూఎస్​డీ కాయిన్​ రూ.83.24

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 31st October 2023 :మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. తరువాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం సహా, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తున్న నేపథ్యంలో.. పెట్టుబడిదారులు ఊగిసలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్​మార్కెట్లు తీవ్రమైన ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 92 పాయింట్లు నష్టపోయి 64,019 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 27 పాయింట్లు కోల్పోయి 19,113 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : టాటా మోటార్స్​, ఏసియన్​ పెయింట్స్​, కోటక్​ బ్యాంక్​, ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​, మారుతి సుజుకి, ఐటీసీ
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్, టీసీఎస్​, టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​

రూపాయి విలువ!
Rupee Open 31st October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ ఒక్క పైసా పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.25గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 31st October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 31st October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.41 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 87.81 డాలర్లుగా ఉంది.

NPS New Rule : ఎన్​పీఎస్​ ఖాతాదారులకు అలర్ట్​.. ఇకపై పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్​ తప్పనిసరి..

Bank Of Baroda Zero Balance Savings Account : ఫ్రీ క్రెడిట్​, డెబిట్​ కార్డ్స్ కావాలా? ​.. BOB లైఫ్​ టైమ్​ జీరో బ్యాలెన్స్ అకౌంట్​ ఓపెన్ చేయండి!

Last Updated : Oct 31, 2023, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details