Gold Rate Today 28th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,525 ఉండగా.. గురువారం రూ.775 తగ్గి రూ.59,750కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.72,990గా ఉండగా.. గురువారం రూ.645 తగ్గి రూ.72,345కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 28th September 2023 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.59,750గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,345గా ఉంది.
- Gold Price In Vijayawada 28th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,750గా ఉంది. కిలో వెండి ధర రూ.72,345కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 28th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,750గా ఉంది. కిలో వెండి ధర రూ.72,345గా ఉంది.
- Gold Price In Proddatur 28th September 2023 :ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,750గా ఉంది. కిలో వెండి ధర రూ.72,345కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 28th September 2023 :అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1900 డాలర్లుగా ఉండగా.. గురువారం ఏకంగా 25 డాలర్లు తగ్గి 1875 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.52 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 28th September 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,92,525 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,92,525 |
ఇథీరియం | రూ.1,33,466 |
టెథర్ | రూ.83.14 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,633 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.20 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 28th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 62 పాయింట్ల లాభంతో 66,181 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 13 పాయింట్లు ఎగబాకి 19,729వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్స్ : ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, టైటన్, విప్రో, ఐటీసీ.