Gold Rate Today 28th November 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,510 ఉండగా.. మంగళవారం రూ.288 పెరిగి రూ.63,798కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.76,215 ఉండగా.. మంగళవారం రూ.1,201 పెరిగి రూ.77,416కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 28th November 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.63,798గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.77,416గా ఉంది.
- Gold Price In Vijayawada 28th November 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,798గా ఉంది. కిలో వెండి ధర రూ.77,416కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 28th November 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.63,798గా ఉంది. కిలో వెండి ధర రూ.77,416గా ఉంది.
- Gold Price In Proddatur 28th November 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,798గా ఉంది. కిలో వెండి ధర రూ.77,416కు చేరుకుంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 28th November 2023 : అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2010 డాలర్లు ఉండగా.. మంగళవారం 5 డాలర్లు పెరిగి 2015 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 24.63 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 28th November 2023 : మంగళవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.30,97,695 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.30,97,695 |
ఇథీరియం | రూ.1,68,828 |
టెథర్ | రూ.83.35 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,927 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.35 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 28th November 2023 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ మార్కెట్ అస్థిర పరిస్థితుల వల్ల ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 9 పాయింట్లు లాభపడి 65,978 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్లు వృద్ధి చెంది 19,821 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ :బజాజ్ ఫిన్సెర్వ్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, విప్రో
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి