Gold Rate Today 26th September 2023 : దేశంలో పసిడి ధర స్వల్పంగా తగ్గగా.. వెండి రేటు మాత్రం భారీగా దిగి వచ్చింది. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,910 ఉండగా.. మంగళవారం రూ.140 తగ్గి రూ.60,770కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.74,978గా ఉండగా.. మంగళవారం రూ.1,378 తగ్గి రూ.73,600కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 26th September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,770గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,600గా ఉంది.
- Gold Price In Vijayawada 26th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,770గా ఉంది. కిలో వెండి ధర రూ..73,600కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 26th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,770గా ఉంది. కిలో వెండి ధర రూ.73,600గా ఉంది.
- Gold Price In Proddatur 26th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,770గా ఉంది. కిలో వెండి ధర రూ.73,600కు చేరుకుంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 26th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1924 డాలర్లుగా ఉండగా.. మంగళవారం కూడా 1914 డాలర్ల వద్దనే ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.97 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 26th September 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,85,651 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,85,651 |
ఇథీరియం | రూ.1,32,108 |
టెథర్ | రూ.83.10 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,538 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.20 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 26th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 98.14 పాయింట్లు నష్టపోయి 65,925.55 వద్ద ప్రారంభమైంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 18.75 పాయింట్లు కొల్పోయి 19,655.80 వద్ద ట్రేడవుతోంది.
- లాభపడిన షేర్స్ : టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్‌టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటన్, రిలయన్స్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ.
- నష్టపోయిన స్టాక్స్ : టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ.