తెలంగాణ

telangana

ETV Bharat / business

పెళ్లిళ్ల సీజన్​ ఎఫెక్ట్​- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు- ఎంతంటే?

Gold Rate Today 14th December 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.​ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 2023 14th December
Gold Rate Today 14th December 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 10:03 AM IST

Gold Rate Today 14th December 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.62,948 ఉండగా.. గురువారం రూ.1,476 పెరిగి రూ.64,424కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.72,850 ఉండగా.. గురువారం రూ.2,595 పెరిగి రూ.75,445కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 14th December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,424గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,445కు పెరిగింది.
  • Gold Price In Vijayawada 14th December 2023 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,424గా ఉంది. కిలో వెండి ధర రూ.75,445కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 14th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,424గా ఉంది. కిలో వెండి ధర రూ.75,445కు పెరిగింది.
  • Gold Price In Proddatur 14th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,424కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.75,445కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 14th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1978 డాలర్లు ఉండగా.. గురువారం 54 డాలర్లు పెరిగి 2032 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.86 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 14th December 2023 : టెథర్​, యూఎస్​డీ కాయిన్​ మినహా మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్​ గురువారం లాభాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ. 35,55,379 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.35,55,379
ఇథీరియం రూ.1,87,378
టెథర్ రూ.83.31
బైనాన్స్ కాయిన్ రూ.20,711
యూఎస్​డీ కాయిన్ రూ.83.29

రూపాయి విలువ!
Rupee Open 14th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 13 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.27గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 14th December 2023 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? రూ.లక్ష బడ్జెట్​లో టాప్​-10 బైక్స్ ఇవే!

మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? పాన్​ కార్డ్​తో సింపుల్​గా చెక్​ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details