తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 12th September 2023 : భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price Today 12th September 2023

Gold Rate Today 12th September 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 12th September 2023
Gold Rate Today 2023 12th September

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 10:21 AM IST

Updated : Sep 12, 2023, 11:57 AM IST

Gold Rate Today 12th September 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,885గా ఉండగా.. మంగళవారం రూ.797 తగ్గి రూ.60,088 వద్దకు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.73,070గా ఉండగా.. మంగళవారం రూ.425 పెరిగి రూ.73,495కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 12th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,088గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,495గా ఉంది.
  • Gold Price In Vijayawada 12th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,495కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 12th September 2023 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,495గా ఉంది.
  • Gold Price In Proddatur 12th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,495కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 12th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1923 డాలర్లు ఉండగా.. మంగళవారం కూడా అదే ధర వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.18డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 12th September 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,44,363 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,44,363
ఇథీరియం రూ.1,31,629
టెథర్​ రూ.82.95
బైనాన్స్ కాయిన్ రూ.17,385
యూఎస్​డీ కాయిన్​ రూ.82.99

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్​ మార్కెట్లు.. నిఫ్టీ 50@20,110 ఆల్​టైమ్ న్యూ హైరికార్డ్​!
Stock Market Today 12th September 2023 :వరుసగా 8వ రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం సహా, విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఫలితంగా నిఫ్టీ 50 తొలిసారి 20,110 పాయింట్లు ఎగబాకి న్యూ హైరికార్డ్​ నమోదు చేసింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 172 పాయింట్లు లాభపడి 67,299 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 26 పాయింట్లు వృద్ధిచెంది 20,002 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎల్​ అండ్​ టీ, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​, యాక్సిస్ బ్యాంక్​, ఇన్ఫీ, సన్​ఫార్మా, టెక్​ మహీంద్రా, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ :కోటక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్​ పెయింట్స్, నెస్లే ఇండియా, విప్రో, టైటన్​, ఎం అండ్​ ఎం, టాటా స్టీల్​, మారుతీ, రిలయన్స్​, హెచ్​యూఎల్, టాటా మోటార్స్​, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ.

రూపాయి విలువ!
Rupee Open 12th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే, రూపాయి మారకం విలువ 10 పైసలు ఎగబాకి రూ.82.93 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 12th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.92గా ఉంది. డీజిల్​ ధర రూ.97.78గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు!
Crude Oil Price 12th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.39 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 90.99 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 12, 2023, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details