Gold Rate Today 10th August 2023 : బంగారం ప్రియులకు గుడ్న్యూస్. దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,096గా ఉండగా.. గురువారం నాటికి ఏకంగా రూ.1026 తగ్గి రూ.60,070కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.72,624గా ఉండగా.. గురువారానికి రూ.574 తగ్గి రూ.72,050కు చేరుకుంది.
- Gold Price In Hyderabad Today 10th August 2023 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.60,070గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,050గా ఉంది.
- Gold Price In Vijayawada Today 10th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,070గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam Today 10th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,070గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050గా ఉంది.
- Gold Price In Proddatur Today 10th August 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,070గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మార్కెట్ ఒడుదొడుకులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price Today 10th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1932 డాలర్లుగా ఉండగా.. గురువారం 13 డాలర్లు తగ్గి 1919 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.70 డాలర్లుగా ఉంది.