Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.200 వరకు పెరిగి రూ.52,520కు చేరింది. కిలో వెండి ధర రూ. 800 మేర పెరిగి 63,115గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,520గా ఉంది. కిలో వెండి ధర రూ.63,115 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,520 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,115గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,115 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,115 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 1846 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.81 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్‌కాయిన్ విలువ మళ్లీ భారీగా పతనమైంది. ప్రస్తుతం రూ. 24,64,118 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,64,118 |
ఇథీరియం | రూ.1,51,168 |
టెథర్ | రూ.82.88 |
బినాన్స్ కాయిన్ | రూ.24,987 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.96 |