తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా.. - బిట్​కాయిన్​ విలువ

gold rate today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.530 వృద్ధి చెందింది. మరోవైపు కిలో వెండి రూ. 1,147 ఎగబాకింది. క్రిప్టోకరెన్సీలు కూడా లాభాలను నమోదు చేశాయి. నష్టాల్లో ఉన్న బిట్​కాయిన్​ లాభాలబాట పట్టింది.

బంగారం
బంగారం

By

Published : May 20, 2022, 10:07 AM IST

Gold price today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.530 పెరుగుదల నమోదైంది. మరోవైపు వెండి ధర భారీగా వృద్ధి చెందింది. బుధవారం రూ.62,196గా ఉన్న కిలో వెండి ధర రూ.1,147 పెరిగి రూ.63,343 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,240 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,240గా ఉంది. కిలో వెండి ధర రూ.63,343 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,240 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,343గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,343 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,343 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,842 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.90 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా..దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India:గత కొన్ని రోజులుగా నష్టాలను నమోదు చేస్తున్న క్రిప్టో కరెన్సీలు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. బిట్​కాయిన్​ విలువ రూ.59,850 పెరిగి రూ.24,61,357కు చేరింది. ఈ నేపథ్యంలో ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,61,357
ఇథీరియం రూ.1,65,487
టెథర్ రూ.81.65
బినాన్స్​ కాయిన్ రూ.25,265
యూఎస్​డీ కాయిన్ రూ.81.74

Stock Market: భారతీయ స్టాక్​మార్కెట్​ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం సెషన్​లో తీవ్ర నష్టాలను నమోదు చేసి 1400కుపైగా పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్​ శుక్రవారం సెషన్​లో తిరిగి పుంజుకుంది. 53,513తో ప్రారంభమైన సెన్సెక్స్ 1112​ పాయింట్లు పెరిగి 53,905కు చేరింది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాలబాట పట్టింది. 347 పాయింట్లు పెరిగి 16,156 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి :'జీఎస్‌టీ మండలి సిఫార్సులను కచ్చితంగా పాటించాలని లేదు.. కానీ'

ABOUT THE AUTHOR

...view details