తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్లాట్​గా బంగారం, వెండి ధరలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు - stock market

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today
Gold Price Today

By

Published : Jul 20, 2022, 11:55 AM IST

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50 పెరిగి.. ప్రస్తుతం రూ.52,150 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.50 పెరిగి.. రూ.56,750 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది. కిలో వెండి ధర రూ.56,750 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,750గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,750 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,750 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,714 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.85 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,44,599 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.19,44,599
ఇథీరియం రూ.1,30,400
టెథర్ రూ.82.50
బినాన్స్​ కాయిన్ రూ.22,196
యూఎస్​డీ కాయిన్ రూ.82.94

Stock Market Live Updates: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​..738 పాయింట్ల లాభంతో.. 55,505 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 213 పాయింట్లు ఎగబాకి.. 16,553 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎం&ఎం, సన్​ ఫార్మా నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి:ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 26% వృద్ధి

'ప్రస్తుతం ట్రేడింగ్​లో లాభాలు కష్టమే.. ఆ వ్యూహం పాటించండి'

ABOUT THE AUTHOR

...view details