దిగొచ్చిన బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధర ఎంతంటే? - బిట్ కాయిన్ అంటే ఏమిటి
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?
GOLD PRICE TODAY
By
Published : Jul 12, 2022, 10:10 AM IST
Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సోమవారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.150 పడిపోయింది. వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి రూ.430 మేర దిగివచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,400గా ఉంది. కిలో వెండి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది. • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,950గా ఉంది. • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది. • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,950 వద్ద కొనసాగుతోంది. • స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,730.5 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.06 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ:బిట్‌కాయిన్ విలువ స్వల్పంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.16,89,223 పలుకుతోంది. ఇథీరియం రూ.3వేలు పతనమైంది. ప్రస్తుతం రూ.88వేల వద్ద కొనసాగుతోంది.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.16,89,223
ఇథీరియం
రూ.92,100
టెథర్
రూ.83.32
బినాన్స్ కాయిన్
రూ.18,800
యూఎస్డీ కాయిన్
రూ.85.80
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 192.82 పాయింట్లు నష్టపోయి 54,202.41 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 70.90 పాయింట్ల నష్టంతో 16,145.10 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.57గా ఉంది. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉండగా.. విప్రో, కొటాక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.